Home » గొంతులో కఫమా.. ఈ చిట్కాలు పాటిస్తే అంతా క్లియర్..!!

గొంతులో కఫమా.. ఈ చిట్కాలు పాటిస్తే అంతా క్లియర్..!!

by Sravanthi
Ad

ప్రస్తుతం వాతావరణం వల్ల చాలామందికి గొంతు సమస్యలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గొంతులో కఫం చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ కఫం పోవాలంటే ఎన్నో రకాలుగా ట్రై చేసిన ఫలితం అనేది ఉండటం లేదు. గొంతులో కఫం ఉన్నవారు చల్లగాలి,చల్లని నీరు,చల్లని పదార్థాలు ఏవి తీసుకోకూడదు. ఈ కఫం తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా కఫం రాకుండా ఉండాలంటే రాత్రి పూట మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోకూడదు.

Advertisement

ద్రాక్ష,బత్తాయి, కమల, పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లను తక్కువ తినాలి. అలాగే పంచదారని కూడా తక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా వేడి నీటిని తాగడం, కషాయాలు తీసుకోవడం మంచిది. అల్లం, మిరియాలు,తులసి వేసి కషాయాన్ని తయారు చేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా గొంతులో కఫం పేరుకుపోకుండా ఉంటుంది. ముఖ్యంగా చలవ చేసే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.

Advertisement

అలాగే తమలపాకులతో కషాయాన్ని తయారు చేసుకొని తీసుకోవాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా వేడి నీటిలో తమలపాకుల కర్రలను తీసేసి వాటిని ముక్కలుగా చేసి వేయాలి. వీటిని పది నిమిషాల పాటు అలాగే ఉంచి , ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి గ్లాసులోకి తీసుకొని తాగాలి. ఇలా తమలపాకు కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కఫం సమస్య దూరం అవుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల కఫం సమస్య నుండి ఇట్టే బయటపడవచ్చు.

also read:

Visitors Are Also Reading