పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కు జోడిగా నటించిన హీరోయిన్ కీర్తి రెడ్డి సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి రెడ్డి వరుస ఆఫర్లు అందుకుంది. తొలిప్రేమతో పాటు కీర్తి రెడ్డి మహేష్ బాబు సరసన అర్జున్ సినిమాలో నటించి అలరించింది.
Advertisement
అంతేకాకుండా నాగార్జునకు జోడిగా రావోయి చందమామ అనే సినిమాలో సైతం నటించింది. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో కీర్తి రెడ్డి 2004లో హీరో సుమంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరూ కేవలం రెండేళ్లలోనే 2006లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి రెడ్డి సినిమాలకు పూర్తిగా దూరమైంది.
Advertisement
విడాకుల తర్వాత కీర్తి రెడ్డి ప్రముఖ డాక్టర్ ను పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సినిమాల్లో పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయినా జీవితంలో మాత్రం కీర్తి రెడ్డి సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమంత్ తో విడాకులు తీసుకున్న తర్వాత కీర్తి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
సుమంత్ ను పెళ్లి చేసుకుని ఉండకపోయి ఉంటే తన జీవితం ఇంకా బాగుండేదని కామెంట్స్ చేసింది. ఇక రీసెంట్ గా కీర్తి రెడ్డి… మంచు లక్ష్మి, సమంతలకు స్నేహితురాలు అయిన శిల్పారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసింది. శిల్పారెడ్డి కీర్తి రెడ్డిలు సైతం క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శిల్పారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కీర్తి రెడ్డి సందడి చేసింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.