తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియనివారుండరు. అన్న చిరంజీవి నట వారసత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆయన తన టాలెంటుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సాధారణంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో హీరోల అభిమానులంతా ఒక లెక్కైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో లెక్క అనే విధంగా ఉంటుంది. ఇప్పటికే ఆయన ఎన్నో సెన్సేషనల్ హిట్ సినిమాలు చేసి పవర్ స్టార్ గా మారిపోయాడు. ఇండస్ట్రీలోకి ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ స్టార్ డం మాత్రం అస్సలు తగ్గలేదు.
Advertisement
also read:Sr..ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ మూవీ..కథలో ఉన్న ఆ ఒక్క ట్విస్ట్ వల్లేనా..!!
ఆయన సినిమాల్లో ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ గా రాణించారో అదేవిధంగా రాజకీయాల్లో కూడా అరంగేట్రం చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలనే బలమైన కోరికతో జనసేన పార్టీ ని స్థాపించారు.. ఈ తరుణంలోనే ఆయన పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు.. అలాంటి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గద్దెనెక్కించాలనే ఆలోచనతో చాలా బలంగా ముందుకు పోతున్నారు. ఈ తరుణంలో ఆయన పలు సభలు సమావేశాలతో జోరు మీద ఉన్నారు.. ఈ సందర్భంగా ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.. అదేంటి అంటే..అనగారిన పీడిత కులాలకు మాట ఇచ్చానని, పీడిత కులాలను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించామని,దానికోసమే నేను ముందుకు వెళ్తున్నానని అన్నారు..
Advertisement
2019లో ఓటమికి గురైనప్పుడు అందరూ నేను ఇక పార్టీ వదిలి పారిపోతానని, అవమానభారంతో క్రుంగి పోతానని చాలామంది అనుకున్నారు. కానీ నేను అలాంటి అవమానాలకు భయపడే వ్యక్తిని కాదన్నారు. అవమానాలను, తిట్లను అన్నింటినీ భరిస్తానని వీటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సమాజంలో మార్పు కోసమే అని ఎమోషనల్ అయ్యారు. ఓడిపోయినంత మాత్రాన నా పార్టీని కానీ,నా దేశాన్ని కాని,నా ప్రజలను కానీ వదిలిపెట్టేది లేదని వారి కోసమే నా పోరాటమని బాధ పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే ఆయన హరి హరి వీరమల్లు అనే మూవీ షూటింగ్లో ఉన్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియని పరిస్థితి.
also read: