పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు టాలీవుడ్ లో ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. అందరూ హీరోకి అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టి మరి రెండు, మూడు సార్లు చూస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వానికి కూడా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
Advertisement
ఇది ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ మొదటి సినిమా 1996 అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కొన్ని రోజులపాటు ప్రత్యేకంగా నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ సలహా మేరకు పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యాడు.
Advertisement
బాలీవుడ్ హిట్ మూవీ ఖయామత్ స్ ఖయామత్ తక్ రీమేక్ గా ఈ సినిమాను తిరకేక్కించారు. నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో ఈ సినిమాకు ఒక మీడియం రేంజ్ హీరోకు తగ్గట్లుగానే హై బడ్జెట్ తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ కు రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు అంటే, నెలకు 5000 రూపాయలు ఇచ్చారట. షూటింగ్ పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు మొత్తం పారితోషకం రూ. 50 వేల వరకు వచ్చిందట. ఇక పవన్ కళ్యాణ్ తన తొలి రెమ్యునరేషన్ ను వాళ్ళ అమ్మకు ఇచ్చాడట. కాగా, ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ పరంగా పవన్ కళ్యాణ్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
READ ALSO : లగ్జరీ హెలికాప్టర్ కొన్న కరీంనగర్ వాసి.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు..రేటు ఎంతో తెలుసా ?