చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యి తనకంటే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చిరు తమ్ముడుగా వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను పవన్ క్రియేట్ చేసుకున్నాడు. అంతే కాకుండా రాజకీయాల్లోనూ పవన్ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ఇక పవన్ రీసెంట్ గా ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
కాగా షోలో బాలయ్య అడిగిన ప్రశ్నలకు పవన్ ఆసక్తికర సమాదానాలు చెప్పారు. అంతే కాకుండా తన జీవితంలోని అనేక విషయాలను పంచుకున్నారు. స్కూల్ లో చదువుకుంటున్న సమయంలో తనకు ఓ వ్యాధి ఉండేదని అన్నారు. 6,7 తరగతి చదువుతున్నప్పుడు తనకు ఆస్తమా ఉండేదని తెలిపాడు.
Advertisement
ఆ వ్యాధితో బాధపడుతూ ఉండటం వల్ల తన స్నేహితులు కూడా తనతో ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ పుస్తకాలను చదివేవాడినని అన్నారు. ఇక తన స్నేహితులు ఆటల్లో రానించేవారని కానీ తాను మాత్రం ఒక్క ఆట కూడా ఆడుకోలేకపోయేవాడినని చెప్పారు. దాంతో స్కూల్ కు వెళ్లడం కూడా ఇష్టం ఉండేది కాదన్నారు.
స్కూల్ లో టీచర్ లు కూడా తనకు నచ్చేవారు కాదని ఏవిషయం అయినా ఎవరూ చెప్పకుండా సొంతంగా నేర్చుకోవాలని అనుకునేవాడినని అన్నారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి వల్ల ఓ రోజు చిరంజీవి గన్ తీసుకుని కాల్చుకునే ప్రయత్నం చేశానని అన్నారు. అప్పుఉ నాగబాబు మరియు వదిన సురేఖ గన్ లాక్కుని తిట్టారని చెప్పాడు.
ALSO READ : Veera Simha Reddy : “వీర సింహారెడ్డి” ఓటీటీ ముహుర్తం ఫిక్స్..ఎందులో స్ట్రీమింగ్ అంటే ?