అంగన్వాడి విధుల్లో చేరాలని లేక పోతే తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశించింది అయితే ఇలా ప్రభుత్వం వ్యవహరించడం పై జనసేన పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. అంగన్వాడీలకి అండగా ఉంటామని ప్రకటించింది జనసేన. అంగన్వాడీలకు అండగా ఉంటామని, తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. 42 రోజులు సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామ్యంగా ఉందన్నారు. నామ మాత్రపు వేతనాల తో సేవలందిస్తున్న మహిళల తో సామరస్య పూర్వకంగా చర్యలు జరపకుండా విధుల నుండి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం పోలీసు చర్యలకు దిగడం సరేనది కాదని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.
Advertisement
Advertisement
సీఎం కోటి సంతకాల తో కూడిన వినతి పత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు అంగన్వాడీలను ఈడ్చి వేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందిని అరెస్ట్ చేయడం వాళ్ళ కుటుంబాల కి ఆందోళన కలిగిస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!