టాలీవుడ్ లో రచయితగా నటుడుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి సినిమాల రివ్యూలు చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పరుచూరి గోపాలకృష్ణ వారసుడు సినిమా ను చెప్పారు. అంతే కాకుండా సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
హీరోను పరిచయ చేసిన మొదటి షాట్ అద్భుతంగా ఉందని చెప్పారు. ఉమ్మడికుటుంబం గొప్పదనం చెప్పే సినిమాను తీసినందుకు విజయ్ మరియు వంశీపైడిపల్లిని అభినందించాలని అన్నారు. సినిమాలో ముగ్గురు కొడుకులు ఉంటే వారు ఇల్లు విడిచివెళ్లిపోతారని…వారిని ఇంటికి తీసుకువచ్చే తమ్ముడి కథ ఇది అన్నారు.
Advertisement
తన వ్యాపారసామ్రాజ్యాన్ని చిన్న కుమారుడు మాత్రమే కాపాడగలడని తండ్రి అతడిని ఆఫీస్ లో కూర్చోపెబడతారని కానీ ఇద్దరు కుమారులు అలిగి ఇంటి నుండి వెళతారని చెప్పారు. ఇక రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల సినిమాలో ప్రేమ తక్కువగా ఉందని చెప్పారు. అంతే కాకుండా హీరోయిన్ పాటల్లో తప్ప మరెక్కడా కనిపించలేదని అన్నారు.
సినిమాలో విజయ్ అన్న శ్రీకాంత్ ఓ అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకుంటాడని అయితే చివరికి ఆ అమ్మాయి ఎక్కడకి వెళుతుందో చూపించలేదని అన్నారు. హీరోయిన్ కు మరో 15 నిమిషాల స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేదని చెప్పారు. సినిమాలో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని అన్నారు.
ALSO READ :Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?