తల్లిదండ్రులు పిల్లలపై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి తల్లిదండ్రులు కొన్ని విషయాలని చెప్తూ ఉండాలి. 15 ఏళ్లు వచ్చేలోపు ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఈ విషయాలని నేర్పించాలి. అంటిపెట్టుకుని పిల్లలు వెనక తల్లిదండ్రులు ఉండలేరు. సో కచ్చితంగా వాళ్ళకి నేర్పి తీరాలి. సెల్ఫ్ కేర్ కచ్చితంగా ఆడపిల్లలకి నేర్పాలి భారతదేశంలో తల్లిదండ్రులు పెళ్లి అయ్యేదాకా ఆడపిల్లలకి అన్ని వాళ్లే చూసుకుంటారు. తాము చెప్పినట్లే వినాలని అనుకుంటారు.
Advertisement
Advertisement
ఆడపిల్లలకి అన్ని తల్లిదండ్రులే చూసుకోకూడదు వాళ్లకి ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళని వాళ్ళు చూసుకునే విధంగా మార్చాలి. డబ్బులు విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆడపిల్లలు పెళ్లి అయ్యాక చాలా విషయాల్లో డీల్ చేయడానికి మనీ మెయింటెనెన్స్ రావాలి. ఎలా పొదుపు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నేర్పాలి. శుభ్రత కూడా నేర్పించాలి ఆడపిల్ల ఆరోగ్యం శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. పర్సనల్ హైజీన్ మీద పిల్లలకి అవగాహన కల్పించాలి. అలానే సమయం విలువ కూడా పిల్లలు తెలుసుకునే విధంగా తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించాలి. ఇలా ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఈ విషయాలని నేర్పినట్లైతే కచ్చితంగా ఆడపిల్లలు పైకి వస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!