2011 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత జరిగిన రెండు మెగా టోర్నీల్లో నిరాశపరిచింది. కనీసం ఫైనల్స్ కు కూడా చేరుకోలేదు. కానీ 2023 వరల్డ్ కప్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ఫిక్స్ అయింది. అందుకు తగ్గట్టే లీగ్ స్టేజ్ లో ఓటమి అనేది లేకుండా దూసుకుపోతోంది. ఇక విజయాల ఫామ్ లో ఉన్న టీమ్ ఇండియాకు పెద్ద సమస్య పాండ్యా దూరం అవడం. బంగ్లా మ్యాచ్ లో గాయపడిన ఇంకా కోలుకోవడం లేదు. దీంతో లీగుల్లో మ్యాచ్లకు దూరమయ్యాడు.
కానీ సెమీస్ కు మాత్రం పాండ్యా చేరతాడని బీసీసీఐ తెలిపింది. సెమీస్ లో పాండ్యా జట్టులో ఉండడం చాలా కీలకం. బ్యాటింగ్ లో బౌలింగ్ లో రాణించే పాండ్యా జట్టులో ఉంటే టీమిండియా మరింత పటిష్టంగా ఉంటుంది. ఇక సెమిస్ నాటికి పాండ్యా రెడీ అవుతున్నాడు. లీగ్ లో ఇండియా ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. శ్రీలంక, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా జట్లతో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్ లకు పాండ్యా రెస్ట్ ఇస్తున్నారు.
Advertisement
Advertisement
దాంతో సెమి ఫైనల్ మ్యాచ్లకు పాండ్యా ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ వరల్డ్ కప్ లో పాండ్యాకు బ్యాటింగ్ ఎక్కువగా చేసే ఛాన్స్ రాలేదు. కానీ బౌలింగ్ లో రాణించాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు ఉపయోగపడే పాండ్యా సెమీస్ కు జట్టులో చేరితే మిడిలార్డర్ లో టీమిండియాకు తిరుగు ఉండదు. మెగా టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన భారత్ తన తదుపరి మ్యాచ్ ను శ్రీలంకతో ఆడనుంది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. బ్యాటింగ్లో నిరాశపరిచిన కూడా బౌలింగ్లో దుమ్మురేపింది. షమీ, బూమ్రా, కుల్దీప్ యాదవ్ లు అదరగొట్టారు. టీమిండియా ఇదే తరహాలో ఆల్ రౌండర్ ప్రదర్శన చేస్తే వన్డే వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమి కాదు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.