ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో… టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లు టీమిండియా విజయం సాధించింది. మొట్టమొదట ఆస్ట్రేలియా జట్టుతో ప్రపంచకప్ ప్రారంభించిన టీమిండియా.. ఇప్పటివరకు ఓటమి ఎరుగలేదు. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో.. మొదటి స్థానంలో నిలిచింది టీమిండియా.
అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. మొన్న బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. అతనికి కాలు బెణకడంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కు కూడా పాండ్య దూరమయ్యాడు. పాండ్యా కోల్పోవాలంటే మరో 10 రోజులు సమయం పడుతుందట.
Advertisement
Advertisement
అయితే తాజా సమాచారం ప్రకారం ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ కు కూడా పాండ్య దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. మరో వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని హార్దిక్ పాండ్యాకు డాక్టర్లు సూచించారట. దీంతో ఆదివారం జరిగే ఇంగ్లాండ్ మ్యాచ్ కు పాండ్యా దూరం కానున్నాడని సమాచారం. కాగా… బంగ్లా బ్యాటర్ లీటన్ కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించి పాండియా గాయపడిన సంగతి తెలిసిందే.