పల్లవి ప్రశాంత్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్ మనసులని గెలుచుకున్నాడు. టైటిల్ విన్నర్ గా నిలిచాడు. పల్లవి ప్రశాంత్ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేపింది ఈ గొడవ కారణంగా హోస్ నాగార్జున ఇమేజ్ కూడా పడింది. ఈ క్రమం లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని వాదన కూడా వచ్చింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎప్పుడు లేని విధంగా సక్సెస్ అయింది.
Advertisement
అయితే ఈసారి ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి పల్లవి ప్రశాంత్ చేసిన తప్పు వలన ఇబ్బందుల్లో పడ్డాడు. అలానే పల్లవి ప్రశాంత్ కారణంగా నాగర్జున ఇమేజ్ కూడా పాడయింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రశాంత్ అరెస్ట్ అవడం ఈ వివాదం మీద బిగ్ బాస్ హోస్ నాగార్జున స్పందించాలని డిమాండ్ తెర పైకి వచ్చింది డిసెంబర్ 17న బిగ్బాస్ సీజన్ సెవెన్ ముగిసిపోయింది గ్రాండ్ ఫినాలే అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట అమరదీప్ ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్లాటకి దిగారు వెనుక గేటు నుండి నేరుగా ఇంటికి వెళ్లి పోవాలని పోలీసులు టైటిల్ విన్నర్ ప్రశాంత్ కి చెప్పారు.
Advertisement
కానీ ప్రశాంత్ వినలేదు పోలీసులు ఆంక్షలు పక్కన పెట్టి ప్రశాంత్ ర్యాలీ చేశారు దీనితో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది బెయిల్ మీద బయటకు వచ్చాడు పోలీసులు మాట కనుక వినట్లయితే అతను అరెస్టు అయ్యే వాడు కాదు హైకోర్టు న్యాయమది అరుణ్ కుమార్ మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేసారు ఫిర్యాదులో నాగార్జున బిగ్ బాస్ నిర్వాహకులు కేసులు పెట్టాలి అని అన్నారు. ఇక ఇది ఇలా ఉంటే నెక్స్ట్ సీజన్ నుండి నాగార్జున ఈ షో కి హోస్ట్ గా ఉండరని కూడా వార్తలు వస్తున్నాయి. మరి నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ గా ఎవరు రానున్నారు అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!