పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి పాటలను విడుదల చేయగా సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ ఊ కొడతావా…ఊ ఊ కొడతావా పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా..మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ తన గొంతుతో పాడి ఆకట్టుకుంది. ఇక డీఎస్పీ అందించిన మ్యూజిక్ ఈ పాటకు మరో హైలెట్ అనే చెప్పాలి. అయితే ఈ పాటలో మగాళ్ల బుద్ధిపై ఉన్న కామెంట్లు…మగాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ మగాళ్ల సంఘాలు ఆందోళనలు చేపడతున్నాయి.
Advertisement
మరోవైపు కొందు మగాళ్లు ఈ పాటకు సపోర్ట్ కూడా చేస్తున్నారు. కానీ మహిళలు మాత్రం ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. పాట సూపర్ అని అందులోని పదాలు మగాళ్ల బుద్దిని ఖచ్చితంగా చెబతున్నాయని అంటున్నారు. ఇక రీసెంట్ గా ఈ పాటపై పురుష సంఘాలు కేసు పెట్టిన విషయంపై సినీనటి..బీజేపీ నేత మాధవీ లత కూడా స్పందించింది. పురుషులపై ఒక్కపాట వస్తేనే కేసు పెడితే మహిళలపై ఎన్నో పాటలు వచ్చాయని నేను కూడా కేసు పెట్టాలా అంటూ ప్రశ్నించింది. రారా స్వామి పాట మహిళలను తక్కువ చేసి చూపించేలా ఉందంటూ పేర్కొంది.
Advertisement
ఇదిలా ఉంటే తాజాగా మహిళలు ఈపాటలో స్టెప్పులు వేసినందుకు పాలభిషేకం చేశారు. అమరావతిలోని తాళ్లూరు గ్రామంలోని కోదండ రామాలాయంలో సమంతకు పాలాభిషేకం చేశారు. మహిళ మండిలి లీడర్లు అందులోని సభ్యులు కలిసి చంద్రబోస్, సమంత పేర్లపై అర్చన చేపించి పాలభిషేకం చేశారు. పురుషులది అహంకారమని…పాటపై కేసు వేయడం దుశ్చర్య అని మండిపడ్డారు. ఈ పాటపై కేసు వేసిన పురుషులది వంకర బుద్ధి అంటూ ఆరోపించారు.