World CUP 2023 : వరల్డ్ కప్ సెమీస్ రేస్ లో నాల్గవ బెర్త్ కోసం పోటీ రసవత్తరంగా మారింది. సెమిస్లో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోరు చూడాలనుకున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ మంచి నెట్ రన్ రేటు తో నాలుగవ స్థానంలో నిలిచింది.
ఈ తరుణంలో పాకిస్తాన్ 4వ స్థానంలోకి రావాలంటే అద్భుతమే చేయాలి. అసలు పాకిస్తాన్ ఏం చేస్తే సెమిస్లోకి అడుగుపెడుతోదో ఇప్పుడు చూద్దాం…. శనివారం ఇంగ్లాండ్ పై కనీసం 287 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ మొదటగా బ్యాటింగ్ చేస్తే 150 పరుగులకి ఆల్ అవుట్ చేయాలి. ఆ టార్గెట్ ను కూడా కేవలం 3.4 ఓవర్లలోనే అందుకోవాలి.
Advertisement
Advertisement
ఈ రెండు జరగడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పుకోవాలి. అందువల్ల వరల్డ్ కప్ లో పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతు అయినట్లే. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ పోరు జరిగే అవకాశం ఉంది. కాగా టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించి సెమీఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఇక లీగ్ దశలో భాగంగా ఆదివారం రోజున నిద్రలేని జట్టుతో మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా. ఇక ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాతో టి20 ల సిరీస్ ఆడనుంది. ఈ టి20 సిరీస్ కు సీనియర్లందరూ రెస్ట్ తీసుకోనున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.