ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నిన్న కీలక మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 18 వ మ్యాచ్ జరిగింది. అయితే ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 367 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో మార్స్ మరియు డేవిడ్ వార్నర్ ఇద్దరు సెంచరీలు చేశారు. ఇక అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు… పోరాడి ఓడిపోయింది. లక్ష చేదనలో 305 పరుగులకు ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జట్టు పై 62 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఇదంతా పక్కకు పెడితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
Advertisement
Advertisement
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ జట్టు సపోర్టర్స్… పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అయితే అక్కడే ఉన్నా పోలీస్… అలా నినాదాలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చాడు. మా జట్టుకు మేము సపోర్ట్ చేస్తే.. మీకేమి ఇబ్బంది అని పాకిస్తాన్ ఫ్యాన్స్ అతనితో వాదించారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై మన ఇండియా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇండియాకు వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.