Home » Pakistan Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు 5 నెలల నుంచి జీతాలే లేవు !

Pakistan Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు 5 నెలల నుంచి జీతాలే లేవు !

by Bunty
Ad

 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో పాకిస్తాన్ చాలా దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో రెండు విజయాలు తప్ప… ఏ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక కష్టాల్లో ఉంది పాకిస్తాన్ జట్టు. అయితే… ప్రస్తుత ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల జట్టు పర్ఫామెన్స్ చూసాకా వాళ్ళని విమర్శించని వాళ్లంటూ లేరు. మాజీ ఆటగాళ్లు, అభిమానులు మరియు ఇతర దేశాల క్రికెట్ ప్రేమికులు ఇలా అందరూ విమర్శలు మరియు ట్రోలింగ్ చేస్తూ వచ్చారు.

Advertisement

కానీ ఆ దేశపు మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. జూన్ నెల నుంచి అంటే సుమారు ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతాలు లేవని లతీఫ్ అంటున్నారు. పిసిబి చైర్మన్ నజామ్ సేథీకి… బాబర్ అజాం మెసేజ్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వడం లేదని, లతీఫ్ ఆరోపిస్తున్నారు. అలాగే పిసిబిలోని ఇతర ఉన్నతాధికారులు కూడా అలానే ఉన్నారని అంటున్నాడు.

Advertisement

నీ కెప్టెన్ కె మీరు ఎందుకు జవాబు ఇవ్వడం లేదని లతీఫ్ పాకిస్తాన్లోని ఓ మీడియా ఛానల్లో ప్రశ్నించాడు. అదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ లో మళ్ళీ రివ్యూ చేస్తామని అంటున్నారని, ఇదేం వైఖరి అంటూ లతీఫ్ ఘాటు విమర్శలు చేశారు. ఐదు నెలలుగా జీతాలు అందుకొని ఆటగాళ్లు.. నీ మాట వినాలా అని ప్రశ్నించాడు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading