పాకిస్థాన్ ప్రధాని ఖర్చుల విషయంపై పాక్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ ప్రధాని ఇల్లు గడవాలంటేనే నెలకు యాబై లక్షలు ఖర్చు చేయాలంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు కారణం కూడా ఆయన స్నేహితుడే. ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ వజీవుద్దీన్ అహ్మద్ తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఖర్చులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఇల్లు గడవాలంటే నెలకు యాబై లక్షలు ఖర్చు చేయాల్సిందేనని సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన జహంగీర్ తరీన్ ప్రతి నెలా ఆ డబ్బులను పంపుతాడని ఆరోపణలు చేశాడు.
Advertisement
మొదట్లో ఇమ్రాన్ ఖాన్ ఇల్లు గడవడానికి రూ.20 లక్షలు ఖర్చు అయ్యేవని ఆ తరవాత రూ.30లక్షలు ఖర్చు అయ్యేవని ప్రస్తుతం నెలకు రూ.50లక్షలు ఖర్చు అవుతున్నాయని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ నిజాయితీ పరుడనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే ఆయననను అత్యంత దగ్గరనుండి చూసా కొంతకాలం ఆయన ఇంటి వ్యవహారాలను జహంగీర్ తరీన్ చూసుకునేవారని ఆరోపించారు.
Advertisement
ఇమ్రాన్ ఖాన్ అధికారంలో లేని సమయంలో ఆయన ఇంటి ఖర్చులు 20లక్షలు అయ్యాయి..ఆ తరవాత రూ.30 లక్షలు అయ్యాయి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఇంటి ఖర్చులు నెలకు రూ.50లక్షలు అవుతున్నాయిని సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఇంటి ఖర్చులపై ఆయన స్నేహితుడు వజీవుద్దీన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్ లో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందంటూ ప్రధాని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు ఆయన పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.