ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు అందరి దృష్టి అనేది దానిమీదే ఉంటుంది. కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాకుండా మొత్తం ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ ను చూస్తారు. క్రికెట్ ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాచ్ ఏదైనా ఉంది అంటే.. అది ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అనే విషయం ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఒప్పుకుంటారు.
Advertisement
అయితే గత ఏడాది జరిగిన మ్యాచ్ లో ఇండియాను 10 వికెట్ల తేడాతో యోచించిన పాకిస్థాన్ ఈ ఏడాది కూడా ఆ పని చేయాలనీ అనుకుంటుంది. అయితే ఇండియాను ఓడించడానికి ఇదే సరైన సమయం అంటూ పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ కూడా ఇవే కామెంట్ చేసాడు. ఆయన మాట్లాడుతూ. గత ప్రపంచ కప్ తర్వాత పాకిస్థాన్ పెద్ద దేశాలతో మ్యాచ్ లు అనేవి ఎక్కువగా ఆడలేదు.
Advertisement
కాబట్టి ఈ ఏడాది ఇండియాపై పాక్ ఎలా ఆడుతుందో చూడాలి అంకుంటున్నాను. అయితే ఇండియాను ఓడించడానికి ఈ ఆసియా కప్ అనేది సులువు అయ్యింది పాకిస్థాన్ కు. ఎందుకంటే ఇప్పుడు ఆ జట్టులో ముఖాయమైన బౌలర్లు లేనే లేరు. బుమ్రా గాయం కారణంగా తప్పుకుంటే.. షమీని బీసీసీఐ టీ 20 జట్టుకు దూరం పెడుతుంది. కాబట్టి వీక్ బౌలింగ్ తో ఇప్పుడు ఉన్న ఇండియాను పాకిస్థాన్ ఓడించడానికి సరైన సమయం అని సర్ఫరాజ్ నవాజ్ కామెంట్ చేసాడు.
ఇవి కూడా చదవండి :