Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లాప్ సినిమాల క‌లెక్ష‌న్స్ ఆ హీరోల హిట్ సినిమాల క‌లెక్ష‌న్స్ తో స‌మానం…కావాలంటే మీరూ ఓ లుక్కేయండి..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లాప్ సినిమాల క‌లెక్ష‌న్స్ ఆ హీరోల హిట్ సినిమాల క‌లెక్ష‌న్స్ తో స‌మానం…కావాలంటే మీరూ ఓ లుక్కేయండి..!

by AJAY
Ad

నిర్మాతలు స్టార్ హీరోలతో ఒక్క సినిమా చేస్తే సరిపోతుందని కలలు కంటూ ఉంటారు. నిజానికి ఇండస్ట్రీలో చాలామంది చిన్న హీరోలు ఉన్నారు. అంతే కాకుండా టాలెంటెడ్ హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కానీ నిర్మాతలు మాత్రం స్టార్ హీరోల వెంటనే పడుతుంటారు. అయితే దాని వెనక కూడా ఒక కారణం ఉంది. స్టార్ హీరోల తో సినిమాలు చేస్తే లాస్ లు తక్కువగా వస్తాయని నిర్మాతలు భావిస్తూ ఉంటారు. స్టార్స్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రియు ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ను బ‌ట్టి లెక్క‌లు వేసుకుంటారు.

Advertisement

ఒకవేళ స్టార్ హీరోతో సినిమా చేసి హిట్ కొడితే భారీ రేంజ్ లో లాభాలు వస్తాయని కూడా నమ్ముతారు. ఎక్కువ‌గా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని చాలామంది నిర్మాతలు కోరుకుంటారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత‌ల‌కు పెద్ద‌గా న‌ష్టాలు ఉండ‌వు. అలా ప్లాప్ అయినప్పటికీ ప‌వ‌న్ న‌టించిన చాలా సినిమాలు కోట్ల క‌లెక్షన్స్ ను రాబ‌ట్టాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.


పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో గోపాల గోపాల సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ 89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

Advertisement


సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. చాలా ఏళ్ల పాటు సరైన హిట్ కోసం వేచి చూసిన పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ పడింది. ఇక ఈ సినిమా పవన్ కు తెగ నచ్చడంతో ఆ తర్వాత స‌ర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి తొలి రోజే 50 కోట్ల గ్రాస్ వసూలు అయింది.

పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ ను ఫ్యాన్స్ ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది, జల్సా సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లోనే అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ ను సైతం నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ సినిమా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

 

Visitors Are Also Reading