కరోనా మహమ్మారి విజృంభణతో ఎవరైనా లాభం పొందారు అంటే అది కేవలం ఓటీటీ సంస్థలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇలా ఎంట్రీల మీద ఎంట్రీలు ఇస్తుండటంతో థియేటర్ల వ్యవస్థ చితికిపోతుంది. అంతే కాకుండా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారు. అదేవిధంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో నటీనటులు సైతం ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో థియేటర్లు మూత పడటంతో పలు సినిమాలు ఓటిటిలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా ఆంక్షల కారణంగా పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. దాంతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలకు ఓటిటిలు భారీ ఆఫర్లు ప్రకటించినట్టు తెలుస్తోంది. అలా ఏ సినిమాకు ఎన్ని కోట్ల డీల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
కరోనా కేసులు పెరగడంతో మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా వేసుకుంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ ఓటిటి నుండి 350 కోట్ల ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది. ఈ సినిమాకు కూడా 300 కోట్ల కోట్ల ఆఫర్ వచ్చినట్టు సమాచారం. కానీ నిర్మాతలు నో చెప్పారట.
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన భారీ బడ్జెట్ సినిమా వాలిమై… ఈ చిత్రానికి కూడా ఓ ప్రముఖ ఓటిటి సంస్థ 300 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ నిర్మాత బోనీకపూర్ దానిని పక్కన పెట్టేశారు.
ఈగ సినిమా విలన్ కిచ్చ సుదీప్ హీరోగా నటించిన తాజా చిత్రం విక్రాంత్ రానా. ఈ సినిమాకు కూడా ఓ ప్రముఖ ఓటిటి సంస్థ 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కానీ ఈ సినిమా నిర్మాతలు కూడా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు అన్నింటి పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవే గనక థియేటర్లలో విడుదలైతే ఓటిటి ఆఫర్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు థియేటర్ల వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
Also read : దీప్తి సూనైనా బర్త్ డే..ఆ ఫోటో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పిన షణ్ముక్…కానీ..!