సినిమా సక్సెస్ విషయంలో టైటిల్ పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ముందుగా సినిమా టైటిల్ బట్టే ఆ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అయితే టాలీవుడ్లో కొన్ని సినిమాలకు అసలు కథకు… టైటిల్ కు సంబంధం లేకుండా వచ్చాయి. అంతేకాకుండా అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే, ‘రామ బాణం’ సహా సహా పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ప్రస్తుతం తెలుగులో పాత సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ తరుణంలోని గోపీచంద్ మూవీ రామబాణం టైటిల్ తో గతంలో తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా టైటిల్ ఇప్పుడు… గోపీచంద్ చేస్తున్నాడు.
విజయ్ వారసుడు మూవీ కూడా ఇవి సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ సార్ కృష్ణ మరియు నాగార్జున హీరోలుగా నటించిన వారసుడు టైటిల్ కావడం విశేషం. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. మరి ఆ బాటలో విజయ్ వారసుడు తెలుగులో విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
Advertisement
స్వాతిముత్యం : విశ్వనాథ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించిన మూవీ స్వాతిముత్యం. ఈ సినిమాలో అమాయకుడి పాత్రలో కమలహాసన్ నటనను ఎవరు మర్చిపోరు. గత ఏడాది స్వాతిముత్యం టైటిల్ తో బెల్లంకొండ సురేష్ బాబు రెండవ తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా సినిమా చేశాడు.
మేజర్ : అడవి శేషు హీరోగా నటించిన మేజర్ సినిమా టైటిల్ విషయానికి వస్తే… ఈ సినిమా టైటిల్ చిరంజీవి నటించిన కన్నడ డబ్బింగ్ మూవీ మేజర్ టైటిల్ తోనే థియేటర్లో పలకరించింది.
విక్రమ్ : కమలహాసన్ హీరోగా నటించిన మూవీ విక్రం విషయానికి వస్తే… నాగార్జున హీరోగా నటించిన ఫస్ట్ మూవీ కావడం విశేషం.
read also : షాకింగ్… పాత మంచం ఇచ్చారని పెళ్లి రద్దు