స్వప్న శాస్త్రం మనకు తెలియని ఎన్నో విషయాలని చెప్తుంది. సాధారణంగా మనం నిద్ర పోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కలలో ఆలయం, ఇల్లు ఇలా ఎన్నో రకాల వాటిని మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి ఒక్కొక్కసారి కలలో పాత ఇల్లు కూడా కనబడుతూ ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పాత ఇల్లు లో ఉంటున్నట్లు కల వచ్చినట్లయితే అది మంచి సంకేతం. త్వరలో మీకు పాత బంధువు కానీ స్నేహితుడు కానీ కనపడతారట. దాని వలన మీకు ప్రయోజనం కూడా కలుగుతుందట.
Advertisement
చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం కూడా ఉంటుందిట. కలలో పాత ఇంటిని అమ్మడం కనుక కనపడినట్లైతే శుభ సంకేతం. బాధని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ఇది సూచిస్తుంది. కలలో కనుక పాత ఇంటిని పడగొట్టినట్లు కనపడితే అది మంచిది కాదు. నష్టానికి సంకేతం. ఇలా స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఇవి కనపడితే మంచి చెడుగా పరిగణించబడడం జరిగింది.
Advertisement
పాత ఇల్లు అద్వానమైన స్థితిలో ఉన్నట్లు కల వస్తే జీవితం లో ఆనందం లేకపోవడంను అది సూచిస్తుంది. కొత్త అడుగు మీరు వేయాలని సంకేతం. ఎప్పుడూ చూడని ఇల్లు కానీ శిథిలావస్థలో ఉన్న ఇల్లు కానీ కలలో కనపడితే సమీప భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని దాని వెనుక అర్థం. ఇలా మనం పాత ఇల్లు కనుక కలలో చూసినట్లయితే ఈ విధంగా జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!