Home » RRR MOVIE : రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరి రెమ్యునరేషన్ ఎంత…ఇద్దరిలో ఎవరెక్కువ‌ తీసుకున్నారు..?

RRR MOVIE : రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరి రెమ్యునరేషన్ ఎంత…ఇద్దరిలో ఎవరెక్కువ‌ తీసుకున్నారు..?

by AJAY
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరిస్ నటించగా రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించారు.

Advertisement

ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 25న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి షో తోనే అంచనాలు అందుకుంది అంటూ సర్వత్రా సినిమాకు పాజిటివ్ టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కు స్క్రీన్ స్పేస్ మరియు కథ పరంగా ప్రాధాన్యత కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయం పై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Advertisement

కానీ సినిమాలో చాలా సన్నివేశాలు ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ చేసినా కథ అనుకున్నట్టు గా తీయాలి కాబట్టి ఎన్టీఆర్ విషయం లో జక్కన్న బ్యాలెన్స్ తప్పక పట్టలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్ కు కీ రోల్ వచ్చిన ఎన్టీఆర్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

కాగా మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక సినిమాలో రామ్ చరణ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే 45 కోట్ల వరకూ పుచ్చుకున్నాడట. అంతే కాకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ కంటే ఎక్కువే తీసుకున్నాడట. ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ.50 కోట్లకు పైనే ఉంటుంది.

Visitors Are Also Reading