సినిమా ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలు పోటీకి దిగడం చాలా కామన్ కానీ తల్లి దండ్రులు హీరో అయ్యి వారిద్దరూ పోటీకి దిగితే ఆ మజానే వేరు. అయితే ఒకప్పుడు స్టార్ హీరో ఏన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగిన బాలయ్య తన తండ్రితోనే బాక్స్ బరిలోకి దిగారు. అంతే కాకుండా అదే ఏడాది తండ్రీ హీరోలను ఢీ కొట్టడానికి ఏఎన్ఆర్ సైతం బరిలోకి దిగారు. మరి ఆ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఎవరు గెలిచారు..?
Advertisement
అనేది ఇప్పుడు చూద్దాం….అన్నగారు ఎన్టీఆర్ పేరు వినగానే మనకు ఎన్నో రకాల పాత్రలు గర్తుకు వస్తాయి అందులో ఒకటి సాధువు గెటప్..అన్నగారు సాధువు గెటప్ లో నటించిన సినిమా శ్రీమద్విరాట్ వీరభ్రహ్మేంద్రస్వామి చరిత్ర. ఈ సినిమా వందకు పైగా ప్రింట్స్ రిలీజ్ అయ్యి మొదటిసారి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాకుండా అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య సిద్ద పాత్రలో అద్భుతంగా నటించాడు.
Advertisement
ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం మరో విశేషం. అంతే కాకుండా ఈ సినిమాను మూడు కోట్ల మంది చూశారు. ఈ సినిమాకు పోటీగా గృహలక్షి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా చిరంజీవి అగ్నిగుండం సినిమాతో బరిలో నిలిచారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
వీటితో పాటూ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన సంగీత సామ్రాట్ విడుదలైంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. వీటితో పాటూ బాలయ్య కథానాయకుడు సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తండ్రి సినిమాకు తానే పోటీగా దిగి సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఓవరాల్ గా చూస్తే ఆ ఏడాది మాత్రం శ్రీమద్విరాట్ వీరభ్రహ్మేంద్రస్వామి సినిమానే బాక్స్ ఆఫీస్ ఫైట్ లో విజయం సాధించింది.