Home » శ్రీదేవి త‌న‌కు గురువు అని చెప్పుకున్న ఎన్టీఆర్..! ఆయ‌న ఎందుకు అలా అనేవారో తెలుసా..?

శ్రీదేవి త‌న‌కు గురువు అని చెప్పుకున్న ఎన్టీఆర్..! ఆయ‌న ఎందుకు అలా అనేవారో తెలుసా..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని జంట‌లు ప్ర‌త్యేకంగా నిలిచిపోతాయి. వారి కాంబినేష‌న్ లో సినిమా అంటే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ప‌ట్టించుకోకుండా ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి చూసేస్తారు. అలాంటి హిట్ పెయిర్స్ లో ఒక‌ప్పుడు ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేష‌న్ కూడా ఉండేది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా అంటే ప్రేక్షకులు పండ‌గ చేసుకునేవారు. ఇక వీరిద్ద‌రూ హీరోహీరోయిన్ లుగా న‌టించిన మొద‌టి సినిమా వేట‌గాడు.

Advertisement

ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. కానీ ఈ సినిమా కంటే ముందు వీరిద్ద‌రూ క‌లిసి బ‌డిపంతులు అనే సినిమాలో న‌టించారు. ఆ సినిమాలో శ్రీదేవి ఎన్టీఆర్ కు మ‌న‌వ‌రాలిగా న‌టించింది. ఆ సినిమా వ‌చ్చిన ఐదేళ్ల‌కే వేట‌గాడు సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో శ్రీదేవి ఎన్టీఆర్ అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. వీరిద్ద‌రూ క‌ల‌సి ఆకు చాటు పిందపడితే పాట‌కు స్టెప్పులు వేయ‌గా ఆ సాంగ్ మ‌రియు వీరిద్ద‌రి డ్యాన్స్ థియేట‌ర్ లో విజిల్స్ కొట్టించాయి.

Advertisement

అప్ప‌ట్లో ఈ పాట చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అంతే కాకుండా వీరిద్ద‌రి మ‌ధ్య ఉండే సీన్లు కూడా హైలెట్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ త‌న గ‌త సినిమాల కంటే డ్యాన్స్ లో ఇర‌గ‌దీసిన సంగతి తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ శ్రీదేవినే ద‌గ్గ‌రుండి నేర్పించార‌ట‌.

ఎన్టీఆర్ ఎక్కువ‌గా వేసిన స్టెప్పులనే మ‌ళ్లీ మ‌ళ్లీ వేసేవార‌ట‌. దాంతో ఓ సారి శ్రీదేవిని త‌నకు డ్యాన్స్ నేర్పించాల‌ని కోర‌గా ఆమె దగ్గ‌రుండి నేర్పించార‌ట‌. అంతే కాకుండా సినిమాల గురించి త‌న‌కే శ్రీదేవి స‌ల‌హాలు ఇచ్చేవార‌ట‌. దాంతో త‌న‌కు శ్రీదేవి గురువు అని అన్న‌గారు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Visitors Are Also Reading