ఈ వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరిచిన టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. ఒకరు ఇద్దరూ అనేకాకుండా జట్టులో అందరూ అద్భుతంగా రాణిస్తూ విజయం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లను అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. కానీ కోహ్లీ, రోహిత్, శమీ కాదని… టీమిండియా అసలు సిసలైన హీరో శ్రేయస్ అయ్యర్ అని మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అయ్యర్ ఏడవ స్థానంలో ఉన్నారు.
పది మ్యాచ్లో కలిపి 506 పరుగులు చేశాడు. టోర్నీ ఆరంభంలో తడబడిన అయ్యర్ చివరి ఐదు మ్యాచుల్లో చెలరేగాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు బాదాడు. చివరి నాలుగు మ్యాచుల్లో అతను వరుసగా 82, 77, 128 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 105 స్కోర్లు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే గంభీర్ అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. టీమిండియాలో అతిపెద్ద గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారంటే అతను శ్రేయస్ అయ్యరే. ఈ టోర్నీలో అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో తన బ్యాటింగ్ తో జట్టు విజయాలతో కీలక పాత్ర పోషిస్తున్నాడని గంభీర్ చెప్పాడు.
Advertisement
Advertisement
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న అయ్యర్ ఒక వరల్డ్ కప్ లో 500కు పైగా పరుగులు చేసిన నాలుగవ ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగవ భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో వెన్నునొప్పి సమస్యతో బాధపడిన అయ్యర్ ఆరు నెలలకు పైగా ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత రీఎంట్రీలో కొంత తడబడి విమర్శల పాలయ్యాడు. కానీ సరిగ్గా వరల్డ్ కప్ నాకౌట్ సమయానికి సూపర్ ఫామ్ అందుకున్నాడు. ఫైనల్లో ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా అతను చాలా కీలక కీలకం కానున్నాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.