ఒకప్పుడు నవంబర్ నెల వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో నో షేవ్ నవంబర్ అంటూ పోస్టులు కనిపించేవి. యువత అంతా గడ్డాలు పెంచుకుని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. అయితే నో షేవ్ నవంబర్ అనేది ఊరికే రాలేదు. దానికి కూడా ఓ ఇంట్రెస్టింగ్ చరిత్ర ఉంది. కానీ మనవాళ్లు మాత్రం అసలు మ్యాటర్ తెలియకుండా గడ్డాలు పెంచుకుని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. ఇక ప్రస్తుతం మనోళ్లు కేవలం నవంబర్ లోనే కాకుండా ఏడాది పొడవుగా గడ్డం పెంచుతూ స్టైల్ ను మెయింటెన్ చేస్తున్నారు.
కానీ కొంత మంది ఇప్పటికీ నోషేవ్ నవంబర్ ను పాటిస్తుంటారు. ఇక నోషేవ్ నవంబర్ మొదలైంది కేవలం ఫ్యాషన్ కోసం కాదు…దీని వెనక ఓ మంచి ఉద్దేశ్యం ఉంది. మొదటగా నో షేవ్ నవంబర్ అనే ట్రెండ్ 2003 లో ఆస్ట్రేలియాలో మొదలైంది. ఆ తరవాత 2009లో నో షేవ్ నవంబర్ చాలా ఫేమస్ అయ్యింది. ఇది ఓ చిన్నపాటి ఉద్యమంలాంటిది. అయితే దీని అసలు ఉద్దేశ్యం ఏంటంటే నవంబర్ నెలలో షేవింగ్ చేసుకోకుండా డబ్బును సేవ్ చేయడమట. ఇక అలా సేవ్ చేసిన డబ్బులను జల్సాలకో మరో దానికో వినియోగించడం కాకుండా క్యాన్సర్ రోగుల చికిత్స కోసం దానం చేయాలి.
Advertisement
Advertisement
అంతే కాకుండా క్యాన్సర్ మహమ్మారి బారినపడిన వారికి కీమో థెరపీ చికిత్స ను అందిస్తారు. అయితే ఆ చికిత్స తరవాత నెత్తిపైన జుట్టు పూర్తిగా రాలిపోతుంది. దాంతో మానసికంగా శారీరకంగా తీవ్ర ఆందోళన చెందుతారు. అయితే మనం షేవ్ చేసుకోకుండా పెంచిన జుట్టును మరియు గడ్డాన్ని వారికి దానం చేయడం కూడా నో షేవ్ నవంబర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక అలా ఎంతో మంచి పనికోసం సామాజిక ఉద్యమం లా మొదలైన నో షేవ్ నవంబర్ అనేది కేవలం ప్రస్తుతం ఫ్యాషన్ కోసం గడ్డాలు పెంచి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలా మారిపోయింది. దాంతో క్యాన్సర్ రోగుల చికిత్స కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు యువత అసలు విషయం తెలుసుకుని క్యాన్సర్ రోగుల కోసం ముందుకు రావాలని కోరుతున్నారు.