ఒకప్పుడు ఒకే ఊరికి చెందినవారిని లేదంటే పొరుగు ఊరికి చెందినవారిని వివాహం చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ఏకంగా సముద్రాలు దాటేసి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ప్రేమవివాహాలు జరుగుతున్నాయి. ప్రేమకు కులం, మతం, ప్రాంతం ఇలా ఏదీ అడ్డుకాదు. కాబట్టి తాజాగా నిజామాబాద్ కు చెందిన ఓ కుర్రాడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
Advertisement
ఆ కుర్రాడు ఎవరు..? వాళ్లిద్దరి లవ్ స్టోరీ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం….నిజామాబాద్ జిల్లా మక్లూర్ గ్రామానికి చెందిన రమణారావు కుమారుడు వినీష్ రావు అమెరికాలో మాస్డర్స్ చేస్తున్నాడు. కాగా మాస్టర్స్ చదువుతున్న క్రమంలో వినీష్ రావుకు అమెరికాకు చెందిన బ్రిజేరో లూన అనే యువతి పరిచయం అయ్యింది.
Advertisement
కొంతకాలం తరవాత వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వినీష్ మాస్టర్స్ చదువుతూ ఉండగా బ్రిజేరో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. మొదట వినీష్ కుటుంబ సభ్యులు అమెరికా అమ్మాయి కావడంతో వారి వివాహానికి నో చెప్పారు. కానీ ఆ తరవాత వారి ప్రేమను అర్థం చేసుకుని కుమారుడి ఆనందమే ముఖ్యమని అనుకున్నారు.
దాంతో అమెరికా అమ్మాయితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా వీరి వివాహం నిజామాబాద్ లో ఘనంగా జరిగింది. అమ్మాయిని సైతం భారతదేశ సంప్రదాయ దుస్తుల్లో సిద్దం చేశారు. అంతే కాకుండా అమ్మాయి కుటుంబ సభ్యులు సైతం అమెరికా నుండి వీరి వివాహానికి వచ్చి పెళ్లిలో సందడి చేశారు.