నటి నిత్యామీనన్ అందరికీ తెలుసు. ఈమె ఈ మధ్య సినిమాలే కాకుండా ఈమె వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. నిత్యామీనన్ ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా ఉంటున్నారు. అలా మొదలైంది సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన నిత్యమీనన్ చాలా సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయింది. కేవలం ఒక తెలుగు భాషలోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈమె గుర్తింపుని తెచ్చుకుంది.
Advertisement
Advertisement
ఒకవైపు సినిమాల్లో నటిస్తూ ఇంకోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఈమె అందరినీ అలరిస్తూ వుంది. ఈమధ్య కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో కనపడి నిత్యా మీనన్ అందరిని ఆకట్టుకుంది. అలానే, మలయాళ వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ కూడా స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ లలో ఆమె తన పాత్రకి తగ్గట్టుగా అద్భుతంగా నటించి, అందర్నీ ఆకట్టుకుంది.
ఇక నిత్యా మీనన్ పెళ్లి ఎప్పుడు అని నిత్యా మీనన్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఆమెకి ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. మ్యారేజ్ అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్ అని తనకి అలాంటి సెక్యూరిటీ అవసరం లేదని అంతకుమించి ఆలోచించే వాళ్ళు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నిత్యా మీనన్ చెప్పింది మరి నిత్యా మీనన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.