Home » Niharika Konidela : నిహారిక లవ్ లెటర్‌.. సోషల్ మీడియాలో వైరల్!

Niharika Konidela : నిహారిక లవ్ లెటర్‌.. సోషల్ మీడియాలో వైరల్!

by Bunty
Ad

Konidela Niharika : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవిని ఆయన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది మెగా హీరోలు ఇప్పుడు రాణిస్తున్నారు. కానీ మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం కొణిదెల నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

niharika-divorce

Advertisement

అయితే కొనిదెల నిహారిక ఏది చేసినా వివాదంగా మారుతుంది. 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న నిహారిక… ఈ ఏడాది మొదట్లో తన భర్తకు విడాకులు ఇచ్చింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని.. నిహారిక పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ వారిద్దరి మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకున్నప్పటినుంచి నిహారిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

niharika

ఇలాంటి నేపథ్యంలో నిహారికకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా తనకి ఇష్టమైన వారి కోసం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిహారిక. తనకు నచ్చిన వారు, తనకు ఆదర్శంగా నిలిచిన వారి కోసం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది నిహారిక. అలాగే ఈ వీడియోలో లావణ్య, నిహారిక తల్లి, శ్రీజ లాంటివారు ఉన్నారు. వీడియో రిలీజ్ చేయడమే కాకుండా.. “లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజెల్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ క్యాప్షన్ ఇవ్వడంతో నిహారిక లవ్ లెటర్ వైరల్ అయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading