ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్ తల్లినే అడిగేస్తున్నారు. వంటలు చేయడం దగ్గర నుండి పెద్ద పెద్ద ప్రమోగాలు చేయడం వరకూ గూగుల్ లోనే మొదట వెతుకుతున్నారు. అంతే కాకుండా ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలన్నా ముందుగా గూగుల్ లోనే సెర్చ్ చేస్తున్నారు. బుర్రలో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చిందంటే చాలు మొదట దాన్ని గూగుల్ లోనే సెర్చ్ చేసి తెలుసుకుంటారు.
Advertisement
తాజాగా ఓ సర్వేప్రకారం కొత్తగా పెళ్లైన భార్యలు సైతం తమ భర్తల గురించి గూగుల్ లో వెతుకుతన్నారట. అంటే భర్తలను ఎలా ఇంప్రెస్ చేయాలని తెలియకపోవడంతో ఆ విషయాలను గూగుల్ చేస్తున్నారట. ఇంతకీ ఆ భార్యలు గూగుల్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఇప్పుడు చూద్దాం…. పెళ్లైన తరవాత భార్యలు తమ భర్తలను గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట.
Advertisement
ఎలాంటి పనులు చేస్తే భర్త తాము చెప్పినట్టు వింటాడని గూగుల్ తల్లిని అడుగుతున్నారట. అంతే కాకుండా పిల్లలను కనడానికి ఎలాంటి సమయం మంచిదని కూడా గూగుల్ లోనే వెతుకున్నారట. ఒకప్పుడు అంటే పర్సనల్ గా ఏమైనా సమస్యలు వస్తే తల్లికి చెప్పుకునేవారు కానీ ఇప్పుడు గూగుల్ లోనే వెతుకున్నారు.
అంతే కాకుండా శృంగా* అంటే మొదట భయపడేరు దాని గురించి కూడా గూగుల్ లోనే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు సర్వేలో తేలింది. అంతేకాకుండా అత్తగారికి ఫేవరెట్ కోడలు ఎలా అవ్వాలి….ఆమెను ఎలా బుట్టలో వేసుకోవాలని కూడా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట. మరోవైపు ఆర్థికంగా ఎదగటానికి ఉద్యోగం వ్యాపారాలకు సంబంధించి కూడా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట.