బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ తొలిరోజునే వివాదం నెలకొంది. గుజరాత్ జట్టు ఫిట్నెస్ లేదన్న కారణంగా విండీస్ ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్ పై వేటువేసింది. ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. ఫిట్నెస్ లేదని చెప్పి తనను అకారణంగా డబ్ల్యుపిఎల్ నుంచి తప్పించారంటూ విండీస్ మహిళా క్రికెటర్ డియాండ్రా డాటిన్ ఆరోపణలు చేసింది. తన ప్లేసులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కింబేర్లి గార్త్ ను తీసుకోవడం సరికాదని ఆమె తెలిపింది.
READ ALSO : భర్తలు పొరపాటున ఈ 5 విషయాలు…భార్యకు చెప్పారో మీ బంధం తెగిపోయినట్లే!
Advertisement
అలాగే, సాధారణంగా అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో బౌండరీ లైన్ ను కాస్త ముందుకు జరపడం చూస్తుంటాం. కానీ డబ్ల్యూపిఎల్ విషయంలో బీసీసీఐ మరింత ముందుకెళ్ళింది. హై స్కోరింగ్ మ్యాచులు నమోదు అవ్వాలనే ఉద్దేశంతో బౌండరీ లైన్ ను బాగా తగ్గించేసింది. కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీ లైన్ ను ఉంచింది. అందుకే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్లు అవలీలగా బౌండరీలు కొట్టేశారు. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
Advertisement
READ ALSO : మౌనిక రెడ్డికి ఇది వరకే ఓ కొడుకు..’శివుని ఆజ్ఞ’ అంటూ మంచు మనోజ్ పోస్ట్
కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీని ఏర్పాటు చేసింది. ఇటీవలే ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ లో బౌండరీ లైన్ ను 65 మీటర్ల దూరంలో ఉంచారు. బౌండరీ లైన్ ను తగ్గించడం ద్వారా హై స్కోరింగ్లకు ఎక్కువ అవకాశం ఉంటుందని, మ్యాచ్ చూస్తే అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని బీసీసీఐ పేర్కొంది. అయితే బీసీసీఐ చేసిన పనిని కొంతమంది తప్పుబట్టారు. హైస్కోరింగ్ మ్యాచుల కోసం ఇంత దిగజారుతారా అంటూ కామెంట్స్ చేశారు.
READ ALSO : చత్రపతి విలన్ భార్యను ఎప్పుడైనా చూసారా..? స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు…!