క్రికెట్ ఆడడమన్నా చూడడమన్నా చాలా మందికి ఎంతో ఇష్టం. క్రికెట్ లో ఎన్నో రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఆటగాళ్లు క్రికెట్ ని ఆడాల్సి ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త రూల్ ప్రవేశ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రెడీ అయింది బ్యాటర్ల టైండ్ అవుట్ తరహాలో బౌలర్ ఆలస్యం చేస్తే పెనాల్టీ విధించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది బౌలింగ్ సమయంలో జట్లు సుదీర్ఘ సమయం తీసుకోవడంతో మ్యాచులు ఆలస్యంగా ముగిస్తున్నాయి అందుకే ఈ సమస్యను తగ్గించడానికి ఇప్పటికే స్లో ఓవర్ రేట్ పేరిట కెప్టెన్లతో పాటు ఆటగాళ్లకే జరిమానా విధిస్తోంది.
Advertisement
నిర్ణీత టైంలో బౌలింగ్ చేయకపోతే 30 యాడ్ సర్కిల్ బయట ఒక ఫీల్డర్ ని తక్కువ పెట్టే రూల్ ని తీసుకువచ్చింది అయినా స్లో ఓవర్ రేట్లు మార్పులు రాకపోవడంతో ఇప్పుడు స్టాప్ క్లాక్ రూల్ ని ప్రవేశ పెట్టడానికి రెడీ అయింది. ఈ రూల్ ప్రకారం బౌలింగ్ టీం మూడుసార్లు 60 సెకండ్ల తరవాత ఓవర్ ని ప్రారంభించడంలో విఫలమైతే అయిదు పరుగులు పెనాలిటీని విధించబోతున్నారు. డిసెంబర్ నుండి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ విధానాన్ని ఫాలో అవ్వబోతున్నారు.
Advertisement
స్టాప్ క్లాక్ సహాయంతో ఓవర్ల మధ్య ఆలస్యాన్ని గుర్తించబోతున్నారు ఐదు పరుగుల పెనాల్టీ కాబట్టి మ్యాచ్ లో చాలా మార్పు రాబోతోంది ఈ రూల్ కారణంగా క్రికెట్లో ఉన్న అసలు మజా మిస్ అవుతుందని ఫలితాలు దారుణంగా మారే ఛాన్స్ ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు బ్యాటర్ల ఆధిపత్యం నడుస్తున్న ఈ ప్రస్తుత క్రికెట్లలో కొత్త రూల్ బౌలర్లకి ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు అంతా. 60 సెకండ్లలోనే బౌలింగ్ చేయాలంటే ఫీల్డ్ సెటప్ చేయడానికి కుదరదని కూడా కామెంట్లు వినపడుతున్నాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!