ఇప్పటికి ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ రాహుల్ ఆధ్వర్యంలో ఘోరంగా పరాజయం పాలైంది. దీనికి బాధ్యత వహిస్తూ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు సమాలోచన చేసుకొని ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా బలమైన నాయకుడిగా ఎదగడానికి చాలా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీకి మరో కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి.అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత గా అదిర్ రంజాన్ చౌదరి ఎంపికయ్యారు.
Advertisement
అప్పటి నుంచి ఆయన పదవిలోనే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన స్థానంలో శశి థరూర్, మనీష్ తివారీ వంటి సీనియర్ నాయకులను నియమిస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. మరికొందరు రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడతారని అన్నారు. ఈ వర్షాకాలం సమావేశాలలో కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా బలమైన నేతగా ఎదగడం కోసం గాంధీ కి ఒక మంచి చాన్స్ అని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలుపుతున్నారు.
Advertisement
ప్రస్తుతం అధిర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత గా బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆయనను బెంగాల్ కాంగ్రెస్ చీప్ గా నియమించి ఆయన ప్లేస్ లో రాహుల్ గాంధీని తీసుకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతర్గత కలహాలు అనేవి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. దీని వల్లే పార్టీ ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ALSO READ :
టాయ్‌లెట్‌లోనే సమోసాల తయారీ ఎక్కడో తెలుసా..?
పాకిస్థాన్ లో మెగాస్టార్ క్రికెట్ లీగ్..!