సినిమా ఇండస్ట్రీలో కి రావాలంటే అయితే టాలెంట్ ఉండాలి లేదండే డబ్బులు ఉండాలి. అలా డబ్బులను నమ్ముకుని రీసెంట్ ప్రేక్షకులకు పరిచయమైన హీరో అరుల్ శరవణన్. యాబై ఏళ్ల వయసులో శరవణన్ ది లెంజెండ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంతే కాకుండా తన సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశాడు. ఈ సినిమాకు శరవణన్ పై వచ్చిన ట్రోల్స్ యే పబ్లిసిటీని తీసుకువచ్చి పెట్టాయి.
Advertisement
శరవణన్ తమిళనాడులో ప్రముఖవ్యాపారవేత్తగా గుర్తింపు సాధించాడు. శరవణన్ స్టోర్స్ కు అధినేత గా ఉన్నాడు. ఒకప్పుడు కేవలం బట్టల వ్యాపారం చేసిన శరవణన్ ప్రస్తుతం ఇతర వ్యాపారాలను కూడా చేస్తున్నాడు. ఇక మనదగ్గర లలితా జ్యువలరీస్ యజమాని తన యాడ్స్ లో గుండుతో కనిపించి అందర్నీ తనవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. శరవణన్ కూడా తన వ్యాపార ప్రకటనల్లో తానే నటిస్తూ అందర్నీ ఆకర్శించాడు.
Advertisement
స్టార్ హీరోయిన్స్ తో వ్యాపార ప్రకటనలు చేయిస్తూ వారి పక్కన జోడీగా హీరోలను పెట్టకుండా తానే నటించేవాడు. ఇక ఇప్పుడు తాను ఏకంగా హీరోగా సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్లకు కూడా ప్రేక్షకులు నవ్వుతున్నట్టుగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో శరవణన్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ పార్వతి రౌటెలా నటించిన సంగతి తెలిసిందే.
సినిమాలో నటించినందుకు గానూ ఈ బాలీవుడ్ బ్యూటీకి రూ.20కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నిజానికి ఈ ఆఫర్ నయనతారకు వెళ్లిందట. నయనతారకు భారీ రెమ్యునరేషన్ ను కూడా శరవణన్ ఆఫర్ చేశాడట. కానీ నయన్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.