Home » జైలర్ 2 సినిమా లో రజినీకాంత్ పక్కన నయనతార..?

జైలర్ 2 సినిమా లో రజినీకాంత్ పక్కన నయనతార..?

by Sravya
Ad

గత ఏడాది రజినీకాంత్ హీరోగా జైలర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా అదిరిపోయే రెస్పాన్స్ ని సంపాదించుకుంది. తమిళనాడులో దాదాపు అప్పటి దాకా ఉన్న అన్ని కలెక్షన్ రికార్డులని జైలర్ సినిమా బద్దలు కొట్టేసింది మొత్తం 700 కోట్లకు పైగా కలెక్షన్లు ని రజనీకాంత్ జైలర్ సినిమా రాబట్టింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవడంతో సినిమా సీక్వెల్ కూడా త్వరలోనే వస్తున్నట్లు టాక్. జైలర్ టు మూవీకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని కూడా పూర్తి చేసేసారు దర్శకుడు.

Advertisement

Advertisement

ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు మరొక సినిమాకి కమిట్మెంట్ ఇవ్వలేదు నెల్సన్. తన పూర్తి ఫోకస్ మొత్తం సీక్వెల్ మీద పెట్టారు. సినిమాకి ఉన్న క్రేజ్ ని చూసి సీక్వెల్ ని కూడా అద్భుతంగా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు తాజాగా వినిపిస్తున్న ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో నయనతారని కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా అందుకు ఒకే చెప్పేశారు. నయన్ రజనీకాంత్ కాంబినేషన్లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ నటించబోతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading