Home » అందుకే గాడ్ ఫాద‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్ కు దూరంగా ఉన్నా…న‌య‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అందుకే గాడ్ ఫాద‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్ కు దూరంగా ఉన్నా…న‌య‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

హీరోయిన్ నయనతార ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నయనతార సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ నయనతార మెప్పిస్తోంది. అదేవిధంగా ఒకే రకమైన పాత్రలు చేయకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ ఏడాది నయనతార కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప కూడా జన్మించింది.

Advertisement

ఇక రీసెంట్ గా నయనతార కనెక్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్ లు చేసింది. ఇప్పటివరకు నయనతార ఎప్పుడూ…. ఏ సినిమా ప్రమోషన్స్ లోనూ పాల్గొనలేదు. కానీ మొదటిసారి కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. దాంతో యాంకర్ ఈ విషయంపై ప్రశ్నించారు. మీరు ఎప్పుడూ సినిమా ప్రమోషన్స్ కు ఎందుకు దూరంగా ఉంటారని అన్నారు.

Advertisement

రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో నటించినా ఆ సినిమా కోసం ఎందుకు ప్రమోషన్స్ చేయలేద‌ని ప్రశ్నించారు. దానికి నయనతార సమాధానమిస్తూ గాడ్ ఫాదర్ సినిమా విడుదల సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని చెప్పారు. అంతేకాకుండా తాను ఎక్కువగా బయటకు రానని పొగడ్తలు అంటే తనకు ఇష్టం ఉండదని నయనతార వెల్లడించారు. అంతేకాకుండా తన భర్త విగ్నేష్ శివన్ చాలా మంచివాడు అంటూ నయనతార సర్టిఫికెట్ ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే నయనతార తరచూ ఏదో ఒక విధంగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. పెళ్లైన నాలుగు నెలలకే సరోగ‌సి ద్వారా బిడ్డకు జన్మనిచ్చి సైతం వార్త‌ల్లో నిలిచారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం నయనతార నిబంధనలకు కట్టుబడి సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారని ప్రకటించింది.

ALSO READ: Kaikala Sathyanarayana : కైకాల సత్యనారాయణ సినీ, రాజకీయ ప్రస్థానం గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading