నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమా సాధించిన విజయం గురించి ఇప్పటికి కూడా ఎక్కడో ఒక చోట ప్రస్తావన వస్తూనే ఉంటుంది. సినిమా టీవీ లో వస్తే ఫ్యాన్స్ ఇప్పటికీ చూస్తూ ఉంటారు. ఇక బాలకృష్ణ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాగా ఆ సినిమా నిలిచింది. రాయలసీమ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమాకు కొత్త అర్ధం కూడా చెప్పింది.
Advertisement
రాయలసీమ ముఠా కక్షల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మేడికొండ మురళీ కృష్ణ నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమాకు బీ గోపాల్ దర్శకుడిగా వ్యవహరించారు. సినిమాలో డైలాగులు ఇప్పటికి కూడా పల్లెటూర్లలో వినపడుతూ ఉంటాయి. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకతలు చూస్తే… 2001 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తీసుకొచ్చారు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు తెలుగు సినిమాను ఒక ఊపు ఊపాయి.
Advertisement
ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ కథ వాస్తవికత ఆధారంగానే రాసారు. బీహార్ లో గ్రామంపై ఎవరైనా దాడి చేయడానికి వస్తే, వాళ్లకు ఎదుర్కోవడానికి ఇంటికి ఒక మగపిల్లాడిని చొప్పున బలిపశువుగా ఇస్తూ ఉంటారు. దాన్ని కథగా మార్చి చిన్ని కృష్ణ దర్శకుడికి అందించారు. కేవలం మూడు రోజుల్లోనే ఈసినిమా కథను సిద్దం చేసారు.
ఇక సినిమా సాధించిన విజయం ఇప్పటికి కూడా సంచలనమే. 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఆ తర్వాత 5 ఏళ్ళ పాటు టాలీవుడ్ హీరోలు ఎక్కువగా ఫ్యాక్షన్ కథలకు ప్రాధాన్యత ఇచ్చారు.