Home » ఇదెక్కడి ట్విస్ట్ మావా ! వ్యూహం సినిమా విదులయ్యేలా చేసిందే నారా లోకేష్ ! ఎందుకంటే ?

ఇదెక్కడి ట్విస్ట్ మావా ! వ్యూహం సినిమా విదులయ్యేలా చేసిందే నారా లోకేష్ ! ఎందుకంటే ?

by Sravya
Ad

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా తెరమీదకి ఎక్కబోతోంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలని తీసుకుని ఈ సినిమాని తెరమీదకు తీసుకు రావడం జరిగింది. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో న్యాయపరమైన అడ్డంకుల్ని ఎదుర్కొని ఎట్టకేలకి సినిమా సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం కథ ఆధారంగా సినిమా ని తెర మీదకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. వైయస్ జగన్ పాత్ర లో తమిళ నటుడు నటించాడు. వైయస్ భారతి పాత్ర లో మానస రాధాకృష్ణ నటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు విజయవాడ గుంటూరు పరిసరాల్లోనే జరిగింది.

Advertisement

రెండు పార్ట్స్ కింద ఈ సినిమా ని తీస్తున్నారు ఫస్ట్ పార్ట్ ని ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నారు. శపధం పేరుతో తెరకెక్కిన రెండో భాగం మార్చి 1న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఇప్పటికే వైయస్ జగన్ పాదయాత్ర ని కథాంశంగా తీసుకుని యాత్ర టు సినిమాని తీశారు. ఇప్పుడు వ్యూహం, శపథం ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది వ్యూహం రిలీజ్ అవ్వాల్సి ఉంది. దీన్ని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టుకి ఎక్కారు. అంతే కాకుండా ఈ మూవీ కి సర్టిఫికెట్ ఇవ్వద్దని సెన్సార్ బోర్డు కి లెటర్ రాశారు.

Advertisement

తర్వాత తెలంగాణ హైకోర్టు లో పిటీషన్లు దాఖలు చేశారు దీంతో ఈ సినిమా విడుదల్లో జాప్యం చోటు చేసుకుంది. ఇప్పుడు ఏకంగా ఏపీ లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేడి రాజుకున్న దశ లో విడుదల కాబోతోంది ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. రాంగోపాల్ వర్మ కూడా నారా లోకేష్ కి థాంక్స్ చెప్పారు ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా విలేకరుల తో ఆర్జీవీ మాట్లాడారు చంద్రబాబు నారా లోకేష్ పై సెటైర్లు వేశారు ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి సినిమాని లాగి లాగి ఎన్నికల వరకు తీసుకు వచ్చినందుకు నారా లోకేష్ కి థాంక్స్ అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. లోకేష్ కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ఆర్జీవి. అది ఆయన గ్రేట్ తెలివిగా అభివర్ణించారు. అప్పుడే విడుదల అయ్యుంటే సినిమాని అందరూ మర్చిపోయి ఉండే వారని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading