Home » ఎక్కువ సార్లు నంది అవార్డులు అందుకున్న హీరోలు వీరే..!

ఎక్కువ సార్లు నంది అవార్డులు అందుకున్న హీరోలు వీరే..!

by AJAY
Ad

తెలుగు సినీ నటి నటులు మరియు టెక్నీషియన్లు నంది అవార్డును చాలా ప్రతిష్టాత్మకంగా పురస్కారంగా భావిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులకు … టెక్నీషియన్లకు నంది అవార్డ్ లు దక్కాయి. 1964వ సంవత్సరం నుండి నంది అవార్డులను ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలా నంది అవార్డులను ఇవ్వడాన్ని 50 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా నిర్వహించారు.

Advertisement

ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నంది అవార్డులను ఇవ్వడం నిలిపివేసి 2014 , 2015 , 2016 సంవత్సరాలకు గాను 2017 లో నంది అవార్డులను ఇచ్చారు. ఆ తర్వాతి నుండి ఈ అవార్డులను ఇవ్వడం ఆపేశారు. తాజాగా ఇదే విషయమై కొంతమంది సినీ పెద్దలు నంది అవార్డులను కచ్చితంగా ఇవ్వాలి అని … వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోవాలేవటం లేదు అని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

Advertisement

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు టాలీవుడ్ హీరోల్లో ఎక్కువ సార్లు నాంది అవార్డులను అందుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఉత్తమ హీరోగా ఈ అవార్డును అందుకున్నాడు.

ఆ తరువాత విక్టరీ వెంకటేష్ , జగపతి బాబు 7 సార్లు ఈ అవార్డులను అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , లోక నాయకుడు కమల్ హాసన్ మూడేసి సార్లు ఈ అవార్డులను అందుకున్నారు. 2016 వ సంవత్సరంలో చివరగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీకి గాను బెస్ట్ హీరో అవార్డును అందుకున్నాడు.

Visitors Are Also Reading