Home » మాజీ డీఎస్పీ నళిని కి సీఎం రేవంత్ రెడ్డి ఏ పదవి ఇవ్వనున్నారో తెలుసా ? ఆదేశాలు జారీ ?

మాజీ డీఎస్పీ నళిని కి సీఎం రేవంత్ రెడ్డి ఏ పదవి ఇవ్వనున్నారో తెలుసా ? ఆదేశాలు జారీ ?

by Sravya
Ad

నళిని గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా డిఎస్పీ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో అందరు దృష్టికి వచ్చింది పదవికి రాజీనామా చేశాక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆమె నిరాహార దీక్ష కూడా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కనపడలేదు. మళ్లీ ఇప్పుడు నళిని పేరు వినపడుతోంది. ప్రత్యేక తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెకి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి నళిని పోస్టింగ్ విషయంపై స్పందించారు. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె అదే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. నళిని కి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి డీజీపీ లని ఆదేశించారు.

ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లోకి చేరిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నళినికి మాత్రమే ఎందుకు అన్యాయం జరగాలని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. అయితే నళిని మాత్రం ఉద్యోగానికి మళ్ళీ రావడానికి సిద్ధంగా లేరు. అనారోగ్య కారణాల వలన పోలీసు ఉద్యోగం చేయలేనని ఆమె చెప్పేశారు. నళిని కి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading