టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగచైతన్య గతేడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఏదో ఒక ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్యలను వారి రిలేషన్ షిప్ గురించి.. విడాకుల గురించి ప్రశ్నించడంతో తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక నాగచైతన్య కంటే సమంత ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తోందంటూ అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ హీరో గురించి సమంత ఇంటర్వ్యూలలో మాట్లాడవద్దని సలహాలు ఇస్తున్నారు.
Advertisement
రీసెంట్ గా సమంత కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. కరణ్ జోహార్ నాగచైతన్య పేరు ఏత్తుతూ మీ భర్త అని సంబోధించగా…. సమంత ఎక్స్ హస్బెండ్ అంటూ సంబోధించాలని కరణ్ కు సూచించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.
Advertisement
అయితే ఈ టీవీ షో చూసిన నాగచైతన్య కోపంతో రగిలిపోయాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య కుటుంబానికి దూరంగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని అందులోనే ఒంటరిగా ఉంటున్నారట. అయితే చైతూ ఈ టీవీ షో చూసి కోపంతో సమంతకు సంబంధించిన కొన్ని అగ్రిమెంట్ పేపర్లను కూడా చింపేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
తాను సమంతతో చేసిన సినిమాలు అన్నింటి అగ్రిమెంట్ పేపర్స్ ను చైతన్య చింపేశాడని… ఆమె గుర్తులు ఉండకుండా ఇలా చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తమ పెళ్ళి ఫోటోలను కూడా నాగచైతన్య కాల్చేశాడంటూ రకరకాల వార్తలు టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఇలాంటి వార్తలు వైరల్ అవుతుండడంతో మరోసారి సమంత నాగచైతన్య ల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.