Home » అప్పుడు నాకు సెన్స్ జ్ఞానం లేవు..నాగబాబు ఎమోష‌న‌ల్..!

అప్పుడు నాకు సెన్స్ జ్ఞానం లేవు..నాగబాబు ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సందడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ‌బాబు ఆ త‌ర‌వాత నిర్మాత‌గా మారారు. హీరోగా న‌టుడిగా మ‌రియు నిర్మాత‌గా కూడా సక్సెస్ అవ్వ‌లేక‌పోయారు. కానీ బుల్లితెర‌పై నాగ‌బాబు ఓ సీరియ‌ల్ లో న‌టించ‌గా ఆ సీరియ‌ల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతే కాకుండా నాగ‌బాబు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో కూడా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

Advertisement

Advertisement

ఇక ఈ షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాగ‌బాబు సొంతగా యూట్యూబ్ ఛాన‌ల్ ఓ కామెడీ షోను ర‌న్ చేస్తున్నారు. అదేవిధంగా మాటీవీలో వ‌స్తున్న కామెడీ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మ‌రోవైపు రాజ‌కీయాల్లో కూడా నాగ‌బాబు చాలా చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాన్ స్థాపించిన జ‌నసేన పార్టీలో కీల‌కంగా ప‌నిచేస్తున్నారు.

nagababu

nagababu

ఇదిలా ఉండ‌గా తాజాగా నాగబాబు త‌న తండ్రి కొనిదెల వెంక‌ట్రావు జ‌యంతి సంధ‌ర్బంగా ఎమోష‌న‌ల్ పోస్టును సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ లో…నాన్న నీకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు నీవు బ్ర‌తికి ఉన్న‌ప్పుడు చెప్పాల‌న్న సెన్స్ గానీ జ్ఞానం గానీ నాకు లేవు. ద‌యచేసి చెబుతున్నా మీ ఆత్మీయులు బ్ర‌తికి ఉన్న‌ప్పుడే మీ ఎమోష‌న్స్ ను పంచుకోండి అంటూ నాగ‌బాబు త‌న పోస్ట్ లో పేర్కొన్నారు.

Visitors Are Also Reading