Home » విడాకుల తర్వాత సమంత గురించి మొదటిసారి ప్రస్తావించిన చైతూ… ఆమెలో నాకు నచ్చేది అదే..!

విడాకుల తర్వాత సమంత గురించి మొదటిసారి ప్రస్తావించిన చైతూ… ఆమెలో నాకు నచ్చేది అదే..!

by AJAY
Ad

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరో నాగ చైతన్య… టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంతో కాలం పాటు ప్రేమించి ఒకరిని ఒకరు ఎంతో అర్థం చేసుకొని వివాహం చేసుకున్న వీరిద్దరి దాంపత్య జీవితం కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా కొనసాగింది. ఏది ఏమైందో తెలియదు కానీ సడన్గా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

Advertisement

దానితో వీరి విడాకులపై అనేక వార్తలు అనేక రోజులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాగే వీరు విడాకులు తీసుకొని ఇప్పటికే చాలాకాలం అవుతున్న ఇప్పటికి కూడా వీరిద్దరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే చైతూ… సమంత తో విడాకుల తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కువ శాతం సమంత గురించి పబ్లిక్ ఈవెంట్లలో గాని… సినిమా ప్రమోషన్లలో కానీ మాట్లాడలేదు.

Advertisement

తాజాగా చైతూ “కస్టడీ” అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మే 12వ తేదీన థియేటర్ లలో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చైతూ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వచ్చాడు. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా చైతు విడాకుల తర్వాత తొలిసారి సమంత గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు.

సమంత చాలా హార్డ్ వర్కర్ అని… తన హార్డ్ వర్కింగ్ నేచర్ నాకు చాలా నచ్చుతుంది అని … అలాగే తాను ఏది అనుకుంటే అది చెప్పేస్తుంది అని సమంత గురించి చైతూ చెప్పుకొచ్చాడు. మే 12వ తేదీన థియేటర్లో విడుదల అయిన కస్టడీ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా… కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.

Visitors Are Also Reading