Home » సమంతతో గడిపిన జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..!

సమంతతో గడిపిన జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంతను ప్రేమించి పెళ్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరు పెళ్లికి ముందే ఏం మాయ చేసావే … మనం … ఆటోనగర్ సూర్య సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మజిలీ మూవీలో నటించారు.

Advertisement

వీరి కాంబినేషన్లో వచ్చిన ఆటోనగర్ సూర్య మూవీ మినహా అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి దాంపత్య జీవితం కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా జరిగింది. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. వీరు విడాకులు తీసుకొని విడిపోయి ఇప్పటికే సంవత్సరం దాటిపోతున్న వీరిపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.

Advertisement

ఇలా తనపై … సమంతపై వస్తున్న వార్తలపై తాజాగా చైతు స్పందించాడు. చైతు తాజాగా కస్టడీ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మే 12వ తేదీన థియేటర్లో విడుదల కాబోతుంది. చైతు… సమంత తో గడిపిన జీవితం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

దురదృష్టమశాత్తు నేను సమంత విడిపోయాం కాకపోతే నేను నా జీవితంలో సమంతతో కడిపిన దశ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ గత కొంతకాలంగా మీడియాలో మా ఇద్దరిపై రాస్తున్న వార్తలతో ఆ గౌరవం పోతుంది. నా సినిమాల గురించి ఏమి మాట్లాడినా ఓకే… కానీ నా వ్యక్తిగత జీవితం గురించి మాత్రం తెలిసి తెలియకుండా ఏమీ మాట్లాడకండి అని నాగచైతన్య తాజాగా స్పందించాడు.

Visitors Are Also Reading