జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది. ఒకసారి పెళ్లి జరిగితే జీవితాంతం వారితోనే కలిసి ఉండాలి. కాబట్టి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు పెళ్లికి ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తెలుసుకుని పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు. ఒకవేళ అలా చూసుకుంటూ వచ్చిన సంపాదాలను రిజెక్ట్ చేసుకుంటూ వెళితే చివరికి పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోవాల్సిందే.
Advertisement
అయితే తరాల వరకూ చూడకపోయినా వివాహం చేసుకునేవారి గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే జీవితంలో ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్నామా అని బాధపడకతప్పదు. పెళ్లికి ముందు అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా తమకు కాబోయే వారి ఇష్టా ఇష్టాలను తెలుసుకోవాలట. వారి లక్ష్యాలు ఒకేలా ఉన్నాయా లేదంటే వేరు వేరుగా ఉన్నాయా అనేది కూడా ముందుగానే తెలుసుకోవడం వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉంటాయట.
Advertisement
అంతే కాకుండా ఇద్దరి మధ్య గొడవలు జరిగితే ఎలా పరిష్కరిస్తారు. చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు సర్దుకుపోయే స్వభావం ఉందా లేదా అన్నది కూడా ముందుగానే పరిశీలించుకోవాలట. ఆర్థికనిర్వహణ పై అవగాహణ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ముందుగానే తెలుసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలా ఉన్నవాళ్లు జీవితంలో పైకి వస్తారని చెబుతున్నారు. కుటుంబంతో ఏవిధంగా మెలుగుతారు..సంతానం పై వారి అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని కూడా ముందుగానే తెలుసుకోవాలని చెబుతున్నారు. లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.