జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది. కాబట్టి ఆచి తూచి అడుగెయ్యాలి. పెళ్లికి ముందు పాతికేళ్ల జీవితం ఒకలా ఉంటే పెళ్లి తరవాత అసలు జీవితం అనేది మొదలవుతుంది. బాధ్యతలు పిల్లలు కుటుంబం ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి జీవితాంతం కలిసి ఉండే భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ నాలుగు గుణాలు తప్పకుండా పరిశీలించాలని చాణక్యుడు తన చాణక్యనీతి ద్వారా వెల్లడించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం….
Advertisement
పెళ్లికి ముందు జీవితభాగస్వామిలో బాహ్యసౌందర్యం కంటే అంతర సౌందర్యం చూడాలట. బాహ్యసౌందర్యం లేకపోతే ఎలాంటి కష్టాలు రావు కానీ అంతర సౌందర్యం లేని వ్యక్తులతో జీవితం నరకంగా మారిపోతుందట.
Advertisement
ఆచార సాంప్రదాలయకు విలువ ఇచ్చేవారు భయం భక్తితో ఉంటారట. అలాంటి వారు తప్పులు చేయడానికి భయ పడతారట. దైవభక్తి ఉన్నవాళ్లకు క్రమశిక్షణ సైతం ఉంటుందట. కాబట్టి దేవుడిని ఆరాధించేవారిని ఆచార సంప్రదాయాలను పాటించేవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలట.
పెళ్లి విషయంలో ఎవరి మాట వినకూడదట. తల్లి దండ్రులు చెప్పారనో లేదంటే బంధువులు బలవంతం చేశారనే నచ్చకపోయినా పెళ్లి చేసుకోవడం లాంటివి చేయకూడదట. అలా చేయడం వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుందని చాణక్యుడి నీతితో చెప్పాడు.
జీవిత భాగస్వామిలో కచ్చితంగా సహనం ఉండాలని చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఏ సమస్యను అయినా ఓపిగ్గా పరిష్కరించే గుణం ఉండాలని పేర్కొన్నారు. అలాంటి వాళ్లే ఎంతటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కుంటారని చాణక్యుడు తెలిపాడు.