తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుల్లో ఒకరు అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి ఎన్నో సంవత్సరాలపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదగడానికి కూడా ఎంతో దోహదపడ్డారు.
Advertisement
ఆ కాలంలోనే ఎన్నో ప్రేమ కథ చిత్రల్లో నటించిన నాగేశ్వరరావు గారు ఆ సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గుర్తింపును తెచ్చుకున్న నటులలో మురళీ మోహన్ కూడా ఒకరు. ఈయన కూడా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్… నాగేశ్వరరావు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
Advertisement
తాజా ఇంటర్వ్యూలో భాగంగా మురళీమోహన్ మాట్లాడుతూ … అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సమయంలో రాత్రివేళ పడుకునే ముందు మీరు ఏ బ్రాండ్ తాగుతారు అని అడిగారు. దానికి రాత్రివేళ కేవలం భోజనం చేస్తే పడుకుంటాను ఎలాంటి మందు తీసుకోను అని చెప్పను. దానికి అక్కినేని మనకి 60 సంవత్సరాల వయసు వచ్చాక మన నరాలు సరిగా పనిచేయవు… మనకు హెల్త్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
అందుకని రాత్రి వేళ పడుకునే ముందు ఒకటి… రెండు పెగ్గుల మందు తాగితే మన బాడీ మనం చెప్పినట్లుగా వింటుంది అని చెప్పాడు. దానితో పెద్దాయన చెప్పాడు కదా అని కొన్ని రోజుల పాటు అలాగే పాటించాను… కాకపోతే పెద్దగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కొన్ని రోజులకే ఈ అలవాటును మానేసినట్లు మురళి మోహన్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.