Home » చంద్రబాబు కి ఎంపీ భారత్ సవాల్.. అలా చేస్తే రాజకీయాలని వదిలేస్తా..!

చంద్రబాబు కి ఎంపీ భారత్ సవాల్.. అలా చేస్తే రాజకీయాలని వదిలేస్తా..!

by Sravya
Ad

టీడీపీ అధినేత చంద్రబాబు తన మీద చేసిన ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ ఒక్క ఆరోపణ నిరూపించినా రాజకీయాలని వదిలేస్తానని సవాల్ చేశారు. నీకు దమ్ముంటే నీ కొడుకుని నాపై పోటీకి దింపు అని చాలెంజ్ చేశారు. స్కీముల పేరుతో భారీ స్కాములు చూసి అడ్డంగా దొరికారని రాజమండ్రి జైలులో ఉన్న నువ్వా చంద్రబాబు నన్ను విమర్శించేదని అన్నారు. నువ్వు రాజమండ్రి రూలర్ కాతేరులో నా మీద చేసిన ఆరోపణలలో ఒక్కటైనా నిరూపించగలరని రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ అన్నారు రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన ఆరోపణలని ఆయన ఖండించారు.

Advertisement

Advertisement

నీతి నిజాయితీగా రాజకీయ సేవ చేయడానికి వచ్చానే కానీ నీలాగా నీ పార్టీ వాళ్ళ లాగా రాజకీయాలని అడ్డుపెట్టుకునే డబ్బులు సంపాదించడం కోసం రాలేదని అన్నారు నా ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నానని పేరు కోసం ప్రజల డబ్బు సంపాదించడానికి రాలేదని చెప్పారు. రాజమండ్రిలో మీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వడ్డీ వ్యాపారాలు చీట్ల వ్యాపారాలు చేసి అడ్డంగా దొరకలేదని వారిని పక్కన పెట్టుకొని నన్ను విమర్శించడం దొంగే దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు భరత్ రామ్.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading