నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అన్నగారు పౌరాణిక పాత్రలు తో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునే వారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వెళ్లి ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చుకున్నారు. సేవ చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న నందమూరి తారక రామారావు ఎప్పుడూ కూడా లేడీ సూపర్ స్టార్ అయిన విజయ శాంతిని ఎంతగానో ప్రోత్సహించేవారట. అప్పట్లో ఎన్టీఆర్ విజయశాంతి నటించిన ప్రతిఘటన సినిమాని రెండు సార్లు చూశారట. ఆ సినిమా అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.
Advertisement
తన జీవితంలో రెండు సార్లు చూసిన ఏకైక సినిమా అదేనట. ఇలా చెప్పారంటే, ఆ సినిమాకి ఎన్టీఆర్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. విజయశాంతి సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ మీద కనపడ్డారు ఆ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలుగా ఈమె నటించారు. ఎన్టీఆర్ విజయశాంతి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఆమె ఇంటి నుండి పంపించే లంచ్ బాక్స్ ని కూడా తినేవారట. విజయశాంతి ఎక్కడ కలిసినా మంచి ఆతిథ్యం ఇచ్చేవారట.
Advertisement
ప్రతిఘటన సినిమా కులవివక్ష అణగారిన వర్గాల దుస్థితి వంటి సామాజిక సమస్యల చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. రాజకీయ భావజాలానికి దగ్గరగా ఉంటుంది. న్యాయం సమానత్వం కోసం పోరాడాలని సినిమా సందేశం. ఎన్టీఆర్ కి బాగా నచ్చిందట. ఈ సినిమా 1985 లో రిలీజ్ అయింది ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ప్రొడ్యూస్ చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన టైంలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయింది. ఆమె అద్భుతమైన నటనకి విజయశాంతికి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డు ని కూడా ఇచ్చారు. నంది అవార్డు ని స్వయంగా ఎన్టీఆర్ విజయశాంతికి అందించి ఆమెని అభినందించారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!