మధ్యతరగతి జీవితం మీద సినిమాలు తీయాలంటే కొంచెం సాహసం చేయాలనే చెప్పాలి. ఈరోజు మన మధ్య జరిగే సంఘటనలు అద్భుతంగా చూపించడంలో దర్శకుడు గొప్ప ప్రతిభ చూపిస్తే ఆ సినిమాలు హిట్ అవుతాయి. అప్పట్లో అంతులేని కథ అనే అద్భుతమైన టైటిల్ తో 1976లో బాలచందర్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోలు లేరు, విలన్ లు లేరు, ఫైట్ లు లేవు కేవలం మధ్యతరగతి మనుషుల జీవితాలు మాత్రమే ఉంటాయి.ఈ సినిమాలో హీరోయిన్ జయప్రద పాత్ర చాలా కీలకం. లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.1976 ఫిబ్రవరి 27న అంతులేని కథ సినిమా విడుదలైంది. కలర్ చిత్రాలు కాంపిటిషన్ ఇస్తున్నప్పటికీ అందులో ఉన్న కథ వల్ల ప్రేక్షకులు ఈ సినిమా చూడ్డానికి ఎగబడ్డారు.
జూన్ 30వ తేదీన ఈ సినిమా 125 రోజుల పండుగను మద్రాస్ లో జరుపుకున్నారు. సినిమాలో నటించిన నటీనటులందరూ ఆ ఫంక్షన్ లో హాజరయ్యారు. అయితే హీరోయిన్ జయప్రద మాత్రం ఈ ఫంక్షన్ కి రాలేదు. ఎన్టీఆర్ చాణక్య చంద్రగుప్త సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఆ షూటింగ్ కోసం జయప్రద ఫంక్షన్ కు హాజరు కాలేదు. అయితే ఈ విషయం బాలచందర్ గారికి కోపం తెప్పించింది. అయితే ఫంక్షన్లో ప్రసంగించిన బాలచందర్.. సినిమా షూటింగ్ లో అందరికన్నా ముందుండే హీరోయిన్ ఇప్పుడు సినిమా ఫంక్షన్ కే రాకుండా పోయింది. సినిమా హిట్ అయ్యి ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇక ఈ సినిమా ఫంక్షన్ కి రావడం అనవసరం అనుకుందేమో అందుకే రాలేదు.
Advertisement
Advertisement
నేను స్టార్స్ కోసం ఎదురు చూసే డైరెక్టర్ ని కాదు, నేనే స్టార్స్ ని తయారు చేస్తాను. ఎవరు రాకపోయినా నాకు పెద్ద నష్టమేమీ లేదు అంటూ చాలా ఆవేశంగా మాట్లాడాడు దర్శకుడు బాలచందర్. తర్వాత ఈ విషయం తెలుసుకున్న జయప్రద ఆ సంఘటన మీద దర్శకులకు వివరణ ఇచ్చారు. నేను ఈ ఫంక్షన్ కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను కానీ ఫ్లైట్ టైమింగ్స్ మార్చారని నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది. దాంతో రాత్రి 8 గంటలకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నేను వచ్చేసరికి ఫంక్షన్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు అని వివరణ ఇచ్చారు. కానీ తర్వాత ఎన్నో సందర్భాల్లో జయప్రద బాలచందర్ గారిని కలవడానికి ప్రయత్నిస్తే ఆయన మాత్రం ఆమెకు అనుమతి ఇవ్వలేదు.
also read;
గీతాఆర్ట్స్ ముందు అర్థనగ్నంగా రోదిస్తున్న మహిళ.. న్యాయం చేయాలని ఆందోళన..!!
సీరియల్స్ లో కట్టిన చీరలు..వేసుకున్న బంగారం పడేస్తారా..?